Shraddha Das: అనసూయ గురించి నన్ను ట్రోల్ చేయడంలో అర్థం లేదు: శ్రద్దా దాస్

Shraddha Das: అనసూయ విజయ్ దేవరకొండ పై ఉన్న అక్కసుతో ఆయన సినిమా విడుదలై ఫ్లాప్ టాక్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో అనసూయ అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు…కర్మ ఫలితం రావడం ఆలస్యమైన రావడం మాత్రం పక్క అంటూ చేస్తున్న కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇలా ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని భావించిన విజయ్ అభిమానులు ఒక్కసారిగా అనసూయ పై దండయాత్ర చేశారు.

ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ట్రోల్ చేయడమే కాకుండా ప్రస్తుతం ట్విట్టర్లో ఆంటీ అనే పదం ట్రెండ్ అవుతుంది. ఇలా వేలకొద్దీ ట్వీట్ లతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ఇలా దారుణంగా ట్రోల్ చేయడంతో ఆమె కూడా తగ్గేదేలే అన్నట్టు పెద్ద ఎత్తున తన గురించి ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇస్తున్నారు.ఇలా నేటిజన్స్ పెద్ద ఎత్తున అనసూయ పై కామెంట్లు చేస్తే ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో నటి శ్రద్ధాదాస్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అనసూయకు సపోర్ట్ చేస్తూ… నీకంటే సగం వయసు ఉన్న అమ్మాయిలు కన్నా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీ కంటే రెట్టింపు వయసు ఉన్న అంకుల్స్ కన్నా నువ్వే హాట్ గా కనిపిస్తావు ఎల్లప్పుడు నీకు అభిమానిని అంటూ ఈమె తన అందాన్ని పొగుడుతూ తనకు సపోర్ట్ చేశారు.ఇంకేముంది నెటిజన్స్ అనసూయకి సపోర్ట్ చేస్తావా అంటూ పెద్ద ఎత్తున ఈమెను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఈమె గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో వాటిపై స్పందించిన శ్రద్ధాదాస్ మీరు నన్ను ట్రోల్ చేస్తూ మీ సమయం వృధా చేయకండి ఎందుకంటే మీరు చేసిన ట్వీట్స్ అన్ని నేను డిలీట్ చేస్తాను అలాగే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా అనసూయ గురించి నన్ను ట్రోల్ చేయడంలో ఏమాత్రం అర్థం లేదంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ తనకు ట్వీట్ చేస్తూ అనసూయ గురించి మీకు తెలియదు తాను ఎప్పటినుంచో ఒక హీరో పై పెద్ద ఎత్తున కక్ష కట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకుంటుంది దయచేసి తనకు సపోర్ట్ చేయొద్దు అంటూ ఈమెకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -