Raasi: రాశిని మోసం చేసిన ప్రముఖ డైరెక్టర్ ఎవరంటే?

Raasi: సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను అప్పుడప్పుడు దర్శక నిర్మాతలు మోసం చేస్తూ ఉంటారు. అది ఏ విషయంలోనైనా సరే నటీనటులు మోసపోతూ ఉంటారు. అయితే గతంలో నటి రాశిని కూడా ఓ డైరెక్టర్ మోసం చేశాడట. దానివల్ల ఆమెకు చెడ్డ పేరు కూడా వచ్చిందని తెలిసింది. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు.. ఏ విషయంలో మోసం చేశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాశి. తన అందాలతో ఆ తరం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించింది ఈ బ్యూటీ. ఈమె తొలిసారిగా.. 1986లో మమతల కోవెల చిత్రం ద్వారా బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకొని మంచి పేరు సంపాదించుకుంది.

 

శుభాకాంక్షలు, గోకులంలో సీత సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. నిజం సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే అప్పటివరకు మంచి హీరోయిన్ గా అందరి మదిలో నిలిచిన రాశికి నిజం సినిమాలో చేసిన పాత్ర ద్వారా చాలా విమర్శలు ఎదుర్కొంది.

 

అందులో తన పాత్ర ఎవరికి నచ్చకపోవటంతో అప్పట్లో ఆమెను బాగా విమర్శించుకున్నారు. దీంతో ఆవిడకు అభిమానం కూడా తగ్గిపోయింది. అయితే ఆ విషయం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపింది. అదేంటంటే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ తేజ.. తనకు అటువంటి క్యారెక్టర్ ఉంటుందని ముందు చెప్పలేదని.. కేవలం రౌడీ భార్యగా మాత్రమే చేయాలి అని అనటంతో ఒప్పుకున్నాను అని తెలిపింది.

 

తీరా షూటింగ్ టైంలో తనకు ఆ క్యారెక్టర్ చెబితే చేయనని అనటంతో.. వెంటనే డైరెక్టర్ తేజ మీరు చేయాలి.. లేదంటే షూటింగ్ ఆగిపోతుంది అనటంతో తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది అని తెలిపింది. ముందు ఆ పాత్ర అలా ఉంటుందని చెప్పక డైరెక్టర్ తేజ తనని మోసం చేశారు అని.. అటువంటి పాత్ర చేసినందుకు తనను అభిమానించే ఫ్యాన్స్ కి సారీ కూడా చెప్పారు అని తెలిపింది. అప్పటినుంచి ఏదైనా క్యారెక్టర్ చేయాలి అంటే పూర్తిగా తెలుసుకున్నాక ఓకే చెబుతున్నాను అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -