Gopichand: వైరల్ అవుతున్న గోపీచంద్ తేజ సంచలన వ్యాఖ్యలు!

Gopichand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ తేజ హీరో గోపీచంద్ సినిమా థియేటర్లకు వస్తున్న ఆదరణ గురించి పలు విషయాలను తెలియజేశారు. అయితే గత కొద్దిరోజులుగా చాలా మంది కరోనా రావడంతో ఓటీటీలకు ఆదరణ పెరిగిందని భావిస్తున్నారు.

 

ఇలా ఓటీటీలకి ఆదరణ పెరగటం వల్లే సినిమా థియేటర్లో సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోయిందని భావిస్తున్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తేజ మాట్లాడుతూ ఒకప్పుడు వీధి నాటకాలు చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చూసేవారు. అయితే థియేటర్లు వచ్చిన తర్వాత థియేటర్లకు మంచి ఆదరణ పెరిగింది. అయితే థియేటర్ లు వచ్చిన తర్వాత టీవీలు కూడా వచ్చాయి టీవీలలో సినిమాలు చూస్తున్న థియేటర్లకు ఆదరణ తగ్గలేదు. ప్రస్తుతం యూట్యూబ్, ఓటీటీ వచ్చిన సినిమా చచ్చిపోలేదని తెలిపారు.

 

ఎందుకంటే పెద్ద స్క్రీన్ పై సినిమా చూస్తూ ప్రేక్షకులు ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. అందుకే థియేటర్లకు ఇప్పటికీ వచ్చి సినిమాలు చూస్తున్నారు. అయితే ఇలా ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా చచ్చిపోలేదని మల్టీప్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ రేటు పెరగటం వల్ల సినిమా చచ్చిపోయింది అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

కొన్ని థియేటర్లలో సినిమా టికెట్ రేట్ కన్నా పాప్ కార్న్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటానికి వెళ్లాలంటే దాదాపు రెండు మూడు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది సినిమాలకు రావడం తగ్గిపోయింది అంటూ తెలిపారు. ముందు వాటిని ధరలను నియంత్రణలోకి తీసుకురావాలని అప్పుడే సినిమాలకు కూడా ఇంకా ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా వీరు తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -