Teja: శ్రీరెడ్డి జాతకాన్ని తేజ మారుస్తాడా.. ఆ సినిమాలో ఆఫర్ దక్కుతుందా?

Teja: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీ బ్యూటీగా ఈమె గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా బూతులతో దాడి చేస్తూ ఉంటుంది. ఇకపోతే గతంలో శ్రీ రెడ్డి చాంబర్ ముందు అర్ధ నగ్నంగా నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్టిస్టులకు న్యాయం చేయాలి అంటూ ఉద్యమం లేని ప్రయత్నం కూడా చేసింది.. ఆ సమయంలో చాలామంది సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడ్డారు.

వారిలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. ఆ సమయంలో శ్రీ రెడ్డికి తాను న్యాయం చేస్తాను అంటూ బహిరంగంగా ప్రకటించారు తేజ. అంతేకాకుండా తనకు సినిమాలలో అవకాశాలు కూడా ఇస్తానని తెలిపారు. కానీ ఇన్నేళ్లు గడిచినా శ్రీరెడ్డికి, తేజ ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా ఇదే ప్రశ్న తేజకు ఎదురైనప్పుడు, తను ఇచ్చిన మాట గుర్తుందని, ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తానని, మరోసారి మాటపై నిలబడ్డారు తేజ. అయితే దర్శకుడు తేజ మాట అయితే ఇచ్చారు కానీ ఇప్పట్లో మాత్రం శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వలేరు. దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస సినిమా డైరక్ట్ చేశారు తేజ.

 

అందులో శ్రీరెడ్డికి నో ఎంట్రీ. ఎందుకనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీలో కూడా శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే, ఈసారి రానాతో సినిమా కాబట్టి. దగ్గుబాటి కాంపౌండ్ కు, శ్రీరెడ్డికి మధ్య ఉన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సురేష్ బాబును మామ అని, రానాను బావగారు అంటూ శ్రీరెడ్డి లెక్కలేనన్ని వీడియోలు చేసింది. అందర్నీ దుమ్మెత్తిపోయింది. కాబట్టి తన నెక్ట్స్ మూవీలో కూడా శ్రీరెడ్డికి తేజ ఛాన్స్ ఇవ్వలేడు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -