Daggubati: దగ్గుబాటి హీరో ఆ ఎక్స్ ప్రెషన్లు కూడా పలికించలేడా.. ఘోరమంటూ?

Daggubati: టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఏ విషయాన్ని అయినా కుండలు బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టు మొఖం మీద చెప్పేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంత పెద్ద హీరో అయినా తనకు కావాల్సిన నటన రాబట్టుకోవడంలో తేజా దిట్ట అని చెప్పవచ్చు. కొత్త నటీనటులతో కూడా మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకుంటాడనే ఇమేజ్ తేజకు ఉంది.

ఈ క్రమంలో అవసరమైతే నటీనటుల్ని ఈ దర్శకుడు కొడతాడనే రిమాక్క్ కూడా ఉంది. అయితే ఇలాంటి దర్శకుడికే కొరకరాని కొయ్యగా మారాడంట దగ్గుబాటి అభిరామ్. హీరో దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ అన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఒకసారి శ్రీ రెడ్డి విషయంలో అభిరామ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే అభిరామ్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో అభిరామ్ తో యాక్టింగ్ చేయించడానికి అష్టకష్టాలు పడ్డాడంట తేజ.

 

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో అభిరామ్ తో సన్నివేశాలు తీయడం చాలా ఇబ్బందిగా మారిందట. మరోవైపు హీరోయిన్ కొత్తమ్మాయి అయినప్పటికీ, చక్కగా చేస్తుంటే ఇటు అభిరామ్ మాత్రం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం లేదట.
అలా చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత దర్శకుడు తేజ, తన అనుభవాన్ని అంతా రంగరించి, క్లైమాక్స్ పార్ట్ కోసం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. అదేంటంటే హీరో కనిపించకుండా క్లైమాక్స్ ఫైట్ షూట్ చేశాడట తేజ. ఇదేందయ్యా ఇది. అసలు హీరో లేకపోతే క్లైమాక్స్ బాగుంటుందా అని అనుకుంటే మీరు విన్నది నిజమే.

 

అహింస సినిమా క్లైమాక్స్ ఫైట్ లో హీరో కనిపించడట. కానీ హీరోనే ఫైట్ చేస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందట. అలా తేజ ఏదో జిమ్మిక్కు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అభిరామ్ తో యాక్టింగ్ చేయించడం, తేజ లాంటి దర్శకుడి వల్లే కాలేదంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఈ వార్త సోషల్ ఇండియాలో వైరల్ అవ్వడంతో ఆ దగ్గుపాటి హీరోకి యాక్టింగ్ చేతకాదా, అంత వేస్టా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాను జూన్ రెండవ తేదీ విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -