Sunaina: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ సునైనా!

Sunaina: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ ప్రతిసారీ ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఒక్కొక్క సినిమాకు దాదాపుగా రూ.100 కోట్లు అందుకునేవారు. కానీ రాను రాను సౌత్ ఇండియన్ స్టార్ హీరోలో దానిని మించిపోయారు. తమిళ స్టార్ హీరో రజినీకాంత్, విజయ వంటి స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమాకు గాను దాదాపుగా రూ. 120 నుంచి రూ.130 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గురించి నటి సునైనా సెటైర్లు వేసింది.

సునైనా తమిళంలో కాదలిల్‌ విళిందేవ్‌ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునైనా. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునైనా పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీకు స్క్రిప్ట్‌ రాసి నటించే అవకాశం వస్తే ఏ నటుడిని ఎంపిక చేసుకుంటావు అన్న ప్రశ్నించగా ఆ విషయంపై స్పందించిన సునైనా నటుడు విజయ్, ఫాహత్‌ సాజిద్, విజయ్‌ సేతుపతిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని తెలిపింది.

 

ప్రస్తుతం ప్రముఖ హీరోలు రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. అయినా అంత డబ్బు తీసుకుని ఏం చేస్తారబ్బా? అని సందేహం తనకు కలుగుతుంది అని తెలిపింది సునైనా. కాగా తన తన మొదటి సినిమాకు తాను రూ.15 పారితోషికం అందుకున్నట్లు తెలిపింది..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -