Sunil: మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. జడేజా నో బాల్స్‌పై సునీల్ హెచ్చరిక!

Sunil: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వెనుకంజలో ఉంది. గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ ఒక్క దశలోనూ ఆస్ట్రేలియాను ఢీకొట్టలేకపోతోంది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో విజృంభించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ముప్పతిప్పులు పెట్టాడు. వరుసగా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. కానీ వరుస నో బాల్స్‌తో రవీంద్ర జడేజా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. దీంతో కీలకమైన లబుషేన్ వికెట్ కోల్పోయే అవకాశం జేజారింది. దీంతో జడేజా నో బాల్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

జడేలా నో బాల్స్ వేయడం ఆమోదయోగ్యమైన చర్య కాదని, వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లను గెలిచిన టాప్ స్పిన్నర్ ఇలా చేయడం సరైనది కాదని పేర్కొన్నాడు. దీనికి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించాడు. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే జడేజాతో కూర్చోని సలహాలు ఇవ్వాలని, నో బాల్స్ వేయకుండా పరిస్థితిని సమీక్షించాలని సునీల్ గవాస్కర్ కోరాడు. లైన్ ఇవతల నుంచే బౌలింగ్ వేసేలా జడ్డూకు చెప్పాలని గవాస్కర్ సూచించాడు.

జడేజా నో బాల్స్ వేయకపోతే లబుషేన్ డకౌట్ గా వెళ్లేవాడని, అప్పుడు ఇతర బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పడేదని సునీల్ గవాస్కర్ తెలిపాడు. జడేజా అలా నో బాల్స్ వేయడం సరైనది కాదని, నేర్చుకోవాలని సునీల్ సూచించాడు. కాగా ఇవాళ 156/4 వికెట్లను ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను ప్రారంభించింది. అయితే కేవలం 41 పరుగులు మాత్రమే నేడు చేసి ఆలౌట్ అయింది. లబుషేన్ 31 పరుగులు చేయగా.. స్మిత్ 26, గ్రీన్ 21, హ్యాండ్స్ కాబ్ 19 పరుగులు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -