Vijayanagaram: క్రికెట్ ఆడుతూ పిడుగుపడి యువకుడు మృతి?

Vijayanagaram: మనిషికి చావు నుంచి ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటివరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్ళు ఉన్నఫలంగా ఆకస్మాత్తుగా చనిపోయిన సందర్భాలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు రోడ్డు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నిర్ణయంగా పెరుగుతూనే ఉంది. దీంతో మనిషికి చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది అన్నది చెప్పడం చాలా కష్టం.

తాజాగా కూడా ప్రకృతి వైపరీత్యా కారణంగా ఒక యువకుడు మరణించాడు. అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లా గాజులరేగ గ్రామంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అప్పటివరకు అందరు సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు ప్రభావానికి ఇజ్రాయిల్ అనే ఏళ్ళ యువకుడు అక్కడిక్కడే మరణించాడు. అలాగే అఖిల్, సురేష్ అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

రేపు కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం చిత్తూరు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే మృత్యువు పిడుగురూపంలో వచ్చి కబలించింది. అయితే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించి ప్రజలకు సేవ చేయాలని భావించిన ఇజ్రాయిల్ ఇలా చిన్న వయసుకే ఊహించని విధంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు. ఇజ్రాయిల్ మరణంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మిగిలిన ఇద్దరు యువకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -