Bumrah: బూమ్రా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సెప్టెంబర్ వరకు మ్యాచ్‌లకు దూరం!

Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా సెప్టెంబర్ వరకు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బూమ్రా న్యూజిలాండ్ వెళుతున్నాడు. దీంతో సెప్టెంబర్ వరకు క్రికెట్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. సర్జరీ కోసం న్యూజిలాండ్ వెళుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 2019 నుంచి వెన్ను గాయంతో బూమ్రా బాధపడుతున్నాడు. దీని వల్ల గత కొంతకాలంగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.


వెన్ను గాయానికి బూమ్రా సర్జరీ చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకోసం ఆక్లాండ్‌లోని రోవన్ స్కాటన్ అనే డాక్టర్ దగ్గరకు బూమ్రాను పంపించేందుకు బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. సర్జరీ వల్ల ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బూమ్రా మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం. గతంలో హార్డిక్ పాండ్య సర్జరీ చేయించుకున్నాడు. అప్పట్లో బూమ్రాను కూడా సర్జరీ చేయించుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ వరుస మ్యాచ్ ల కారణంగా బూమ్రా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ వెన్ను గాయం మరింత ఎక్కువ కావడంతో బౌలింగ్ సరిగ్గా వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. గాయానికి శాశ్వత సర్జరీ చేయించుకోవాలని ఇప్పుడు బూమ్రా నిర్ణయించుకోవడంతో బీసీసీఐ కూడా అతడిని విదేశాలకు పంపించేందుకు రెడీ అవుతోంది. బూమ్రా గత మూడేళ్లుగా రెగ్యూలర్ సిరీస్ లు పెద్దగా ఆడలేదు. మధ్యలో రెస్ట్ తీసుకుని ఆడాడు. గతంలో హార్డిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించాడు. ప్రస్తుతం రెగ్యూలర్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

ప్రస్తుతం బూమ్రా కూడా పూర్తిస్థాయిలో సర్జరీ చేయించుకోనున్నాడు. మార్చిలో ఐపీఎల్ జరగనుండగా.. ఆ తర్వాత ఆసియా కప్, ప్రపంచకప్ ఉన్నాయి. ఇప్పటికే బూమ్రా ఐపీఎల్, ఆసియాకప్ కు దూరమవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక అక్టోబర్ ,నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి బూమ్రా ఫిటెనెస్ సాధిస్తే ఆించే అవకాశం ఉంటుంది. కాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున బూమ్రా ఆడుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -