Nidhhi Agerwal: నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. వాటి గురించి చెబుతూ?

Nidhhi Agerwal: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ మజ్ను ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. టాలీవుడ్లో రామ్ పోతినేని, నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. కాగా నిధి అగర్వాల్ చివరగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. తర్వాత మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదు.

 

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటోంది. అసలేం జరిగిందంటే.. నిధి అగర్వాల్ ఒక కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని సలహా ఇచ్చింది. ఆ కండోమ్స్‌తో అనుభూతి ఎంతో బాగుంటుందని తెలిపింది. అంతే కాదు, ఆ కంపెనీకి చెందిన కండోమ్ యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పేజీల్లో కూడా పోస్ట్ కూడా చేసింది. నిధి అగర్వాల్ పోస్టులు చూసి చాలా మంది కూడా షాక్ అయ్యారు. మరికొంత ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు.

ఇక ఆ పోస్ట్ లు కొంతమంది నిధి అగర్వాల్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. కండోమ్స్ మీరు ఉపయోగించారా? అని కొందరు ప్రశ్నించగా ఇంకొందరు మీకు అనుభవం కూడా ఉందా అని ప్రశ్నించారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అసభ్య పదజాలంతో కామెంట్ల రూపంలో ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇం కొంతమంది అటువంటి యాడ్స్ చేయవద్దని సలహా కూడా ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కండోమ్స్ ప్రచారం దుమ్ము దుమారం రేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -