Actor Suman: ఆ ఛానల్ లకు సుమన్ వార్నింగ్.. కేసు వేస్తానంటూ ఫైర్!

Actor Suman: ప్రముఖ నటుడు సుమన్ గురించి తెలియని వారుండరు. తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. సహనటుడుగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళంలో.. హీరోగా, సహానటుడుగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించాడు.

తన సినీ కెరీర్‌లో సుమన్‌ దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగానే కాకుండా ఆయన విలన్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సుమన్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. సుమన్ కు ఆరోగ్యం బాగోలేదని, అనారోగ్యం వల్ల ఆయన మృతి చెందారు అని యూట్యూబ్ లో కొన్ని ఛానల్ లు తెలిపాయి.

సుమన్ ఇక లేరు అని థంబ్ నైల్స్ తో వీడియో లు పెట్టారు. ఇది చూసిన జనాలు ఇది నిజం అని నమ్మారు. ఇంత అకస్మాత్తుగా సుమన్ చనిపోవడం ఏంటి అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే దీనిపై సుమన్ త్వరగానే స్పందించారు. తనకేమీ కాలేదని తను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆయన తమిళ మీడియా ద్వారా తెలిపాడు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తను ఎలాంటి అనారోగ్యానికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశాడు.

ఇలాంటి తప్పుడు వార్తలు చేస్తున్న వారిని ఊరికే వదిలేది లేదని వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటానని ఆయన చెప్పాడు. ఆయన గురించి ఇలాంటి వార్తలను జనాలకి చూపించిన యూట్యూబ్ ఛానల్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆయన అన్నాడు.

ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఓ సినిమా షూటింగ్లో ఉన్నానని.. ఆయనకు తన సన్నిహితుల ద్వారా ఈ వార్తలు అందాయని అందుకే ఈ మీడియా ద్వారా తన ఆరోగ్యం గురించి చెప్పడానికి ముందుకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకోసారి ఇలాంటి వార్తలు రాకూడదని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -