Suman: వైరల్ అవుతున్న హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు!

Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు. ఈయన నటనకు గాను ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకున్నారు. ఇక సుమన్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పోటీగా సినిమాలలో నటించేవారు. అయితే ఈయన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఒక కేసు ఈయన సినీ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది.

 

సుమన్ చెన్నైలోని ఒక బిజీ సెంటర్లో గొడవ చేశారంటూ తనపై పోలీసు కేసు పెట్టారని తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఈ కేసుతో తాను ఏడాది పాటు బయటికి రాకుండా ఉండేలా చేశారని సుమన్ తెలిపారు. అయితే తన తల్లికి అప్పటి తమిళనాడు గవర్నర్ బాగా తెలియడంతో కండిషనల్ బెయిల్ పై ఆరు నెలలకు బయటకు వచ్చానని తెలిపారు.

ఇక నేను జైల్లో ఉండగా తమిళ వార్తాపత్రికలు నా గురించి ఎంతో తప్పుగా రాసేవి. తన వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ వార్తలు రాయడంతో అవి చూసినటువంటి ముగ్గురు హీరోయిన్లు ధైర్యం చేసి తమిళ కుముందం వార్త పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ సుమన్ అలాంటి వ్యక్తి కాదని తాను ఎంతో మంచి వ్యక్తి అంటూ తనకు సపోర్ట్ చేశారని ఈయన తెలియజేశారు. అయితే తమిళ వార్తాపత్రికలు తన గురించి తప్పుగా రాయడంతో తెలుగు పత్రికలు మాత్రం వాటిని చూపెడుతూ ఇది పూర్తిగా తప్పు అని తన గురించి మంచిగా రాసి తనకు సపోర్ట్ చేశారని తెలిపారు.

 

సుమన్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప హీరో ఆయనకు అలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ తెలుగు పత్రికలు తనకు సపోర్ట్ చేశాయని తెలిపారు.సుమన్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి హీరో ఆయన ఊ అంటే చాలు ఆయన పక్కన పడుకోవడానికి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు వస్తారు. అలాంటి క్రేజ్ ఉన్నటువంటి సుమన్ కు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ తెలుగు పత్రికలు ఆయన మంచితనం గురించి వార్తలు రాసారని సుమన్ తెలిపారు.తెలుగు ప్రింట్ మీడియా తనకు ఎంతో మద్దతుగా నిలబడి తనకు సపోర్ట్ చేయడంతో తాను ఈ కేసు నుంచి తొందరగా బయటపడ్డానని తెలిపారు. ఇలా సుమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -