Suman: చంద్రబాబుకు అప్పటివరకు జైలు జీవితమే దిక్కు.. సుమన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Suman: చంద్రబాబు నాయుడు అరెస్టు ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర దుమారాన్ని రేపుతోందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ నటుడు సుమన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయలను దారి మళ్లించిన కేసులో చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టి రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేశారు.

తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకి సమర్పించారు సీఐడీ అధికారులు. ఇరువాదనలు విన్న ఏసీబీ కోర్టు బాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై నాయకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

అలాగే ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుమన్ కూడా ఇదే విషయంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పాలిటిక్స్ లో ఇదొక గుణపాఠం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన బాబుని అరెస్టు చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్టు చేసి ఉంటారని సుమన్ చెప్పారు. సీఎం జగన్ వల్లే బాబు జైలు పాలు అయ్యాడు అనటం సరికాదు. బాబు అరెస్టుకు చాలా కారణాలు ఉండి ఉంటాయి. నిప్పు లేనిదే పొగరాదు కదా స్కామ్ లో బాబు పాత్ర ఉన్నట్టుగా సీఐడీ తేల్చింది. చట్టానికి ఎవరూ చుట్టం కాదు. బలమైన కారణాలతోనే బాబుని అరెస్టు చేసి ఉంటారని సుమన్ తెలిపారు.

తాను టైం ని బాగా నమ్ముతానని, టైం బాగోలేనప్పుడు ఎవరు ఎంత ప్రయత్నించినా బాబు బయటికి రాలేరని,ఆయన టైం బాగుంటే ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా ఆయనే బయటికి వస్తారని తెలిపారు. మా స్టాఫ్ తప్పు చేసినప్పుడు అది మా పైకి వస్తుంది. అలాగే ఆయనకి తెలుసో తెలియకుండానో తప్పు జరిగి ఉండొచ్చు. అంతేకానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం మామూలు విషయం కాదు అంటూ సుమన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -