Suman: జైలు జీవితాన్ని గడిపి వచ్చిన హీరో సుమన్ ని పిలిచి పిల్లనిచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

Suman: హీరో సుమన్ పరిచయం అక్కర్లేని నటుడు. ఒకప్పటి ఈ అందాల నటుడు మన రాష్ట్రం వాడు కాకపోయినా మన దగ్గరే స్టార్ అయ్యాడు. తెలుగులో ఒకానొక సమయంలో నెంబర్ వన్ హీరో గా కూడా పోటీపడ్డాడు. అప్పటికే నెంబర్ వన్ హీరో గా ఉన్న చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బీభత్సంగా సొంతం చేసుకున్నాడు ఈ కన్నడ నటుడు.

ఆ రోజుల్లో సుమన్ ఒకేసారి పది సినిమాలు కి కూడా సైన్ చేసిన రోజులు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆయన చేతిలో 20 సినిమాలు కు పైగానే అగ్రిమెంట్స్ ఉన్న సమయంలో ఆయన కెరియర్ తిరగబడింది. నీలి చిత్రాలు తీస్తున్నాడు అంటూ అతనిని అరెస్టు చేశారు పోలీసులు. దీని వెనుక టాలీవుడ్ లో పెద్ద హీరో హస్తం ఉంది అని అప్పట్లో అనుకునేవారు. నిజా నిజాలు ఏమైనాప్పటికీ సుమన్ కి బెయిల్ రావడం చాలా కష్టమైంది.

చాలా నెలలు కష్టపడిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్ కి సినిమా అవకాశాలు సరిగ్గా రాలేదు. పరువు పోయిందని డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అలాంటి సమయంలో లెజెండరీ టాలీవుడ్ రైటర్ డి.వి నరసరాజు గారు తన మనవరాలు శిరీష ని ఇచ్చి సుమన్ కి పెళ్లి చేశారు. పెళ్లి అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. మళ్లీ అతను కెరియర్లో పుంచుకోవడం ప్రారంభించాడు.

అలా అతని నట ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ తనదైన ప్రతిభని కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అయితే సుమన్ కేవలం నటుడుగానే కాకుండా మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అలాగే రాజకీయ పరంగా కూడా తన అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెప్పడంలో సుమన్ ముందుంటాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -