Suman: ఆ స్టార్ హీరో ఇంటికి సుమన్ కూతురు కోడలిగా వెళ్లనుందా?

Suman: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరో, నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో పాటుగా కుటుంబ కథ చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించాడు. ఇకపోతే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా సుమన్ మొదట నీచల్‌ కులమ్‌ తమిళ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలా సినిమా ఇండస్ట్రీలో సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్‌ యాక్షన్‌ సినిమాలతో పాటు భక్తి చిత్రాల లోను నటించి మెప్పించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక పాల్గొన్న సుమన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ జైలు జీవితం గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు.

 

ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపల లేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సుమన్‌ ఇలాంటి చీప్‌ పనులు చేయడని స్టేట్‌మంట్‌ ఇచ్చారు. అది నాకు బాగా సహాయ పడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూషకు యాక్టింగ్‌ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్‌ యూనివర్సిటీలో హ్యూమన్‌ జెనిటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించింది. సౌత్‌ ఇండియాలోని స్టార్‌ హీరో ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం అని చెప్పు కొచ్చారు సుమన్‌.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -