Keerthy Suresh: అంత తొందరేంటి కీర్తి.. పెళ్లి కోసం ఏకంగా అలా చేయాలా?

Keerthy Suresh: టాలీవుడ్ లో మంచి గిరాకీ ఉన్న నటి కీర్తీ సురేష్. మలయాళం, తమిళ, తెలుగు సినిమాలు చేస్తున్నారు. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. అయితే కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. చాన్నాళ్ల కిందటే ఆ పుకార్లు బలంగానే వ్యాపించాయి. ఇప్పుడా ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయింది.

30 ఏళ్ల కీర్తిసురేష్, ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఇదేదో మేం చెబుతున్నది కాదు. దీనికి బలమైన సాక్ష్యం ఏంటంటే, ఆమె కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ఏ భాషలోనూ అంగీకరించడం లేదు. రీజన్ ఏంటని అడిగితే, పెళ్లి కోసం అనే సమాధానం వస్తోంది. ప్రస్తుతం కీర్తిసురేష్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వీటిలో దసరా అనే తెలుగు సినిమా, మామన్నన్ అనే తమిళ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి.

 

చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్. ఈ సినిమాకు సంబంధించి తన పోర్షన్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయమని ఆమె ఇప్పటికే మెహర్ రమేష్ ను కోరింది. అటు చిరంజీవి కూడా కీర్తిసురేష్ కోసం భోళాశంకర్ షూటింగ్ ను తొందరగా పూర్తిచేస్తున్నారు. ఇక మిగిలిన 3 తమిళ సినిమాల్లో ఒక సినిమాను పూర్తిచేసి, మిగిలిన 2 సినిమాల్ని పెళ్లి తర్వాత పూర్తిచేసేలా నిర్మాతలతో అంగీకారానికి వచ్చింది. ఇలా తన సినిమాల షెడ్యూల్స్ అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేసుకొని, కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదు కీర్తిసురేష్. త్వరలోనే ఆమె పెళ్లిపై ప్రకటన వచ్చేలా ఉంది. దీనిపై ఫ్యాన్సు కూడా సోషల్ మీడియో వేదికగా చర్చలు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -