Heroines: స్టార్ స్టేటస్ రావాలంటే హీరోయిన్లు ఆ పనులు చేయక తప్పదా?

Heroines: మామూలుగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ఎప్పటికప్పుడు హీరోయిన్లు అందాలపరంగా మెప్పిస్తూనే ఉండాలి. నిజానికి స్టార్ హీరోలకు ఇటువంటి బాధలు ఉండవు. అదే స్టార్ హీరోయిన్ అయితే ఒక్కసారి తన ఫిజిక్, అందాన్ని కోల్పోయిన వెంటనే తనని ఇండస్ట్రీ బ్యాన్ చేసేస్తుంది. కానీ కొంతమంది హీరోయిన్లు అందం పరంగా బాగున్నప్పటికీ కూడా ఎందుకో దర్శక నిర్మాతలు వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళ కెరీర్ ను ఎటు కాకుండా చేస్తూ ఉంటారు.

 

ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు అవకాశాలు లేక కెరీర్ ఎలా సాగించాలి అలాగే మిగిలిపోతున్నారు. అయితే కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా కూడా అవకాశాలు అందుకుంటున్నారు. నిజానికి అది వాళ్ళ అదృష్టమని చెప్పాలి. అయితే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టడానికి కారణం ఏదో కాదు సోషల్ మీడియా, బుల్లితెర అని చెప్పాలి.

అవును నిజానికి ఈ రెండు వేదికల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లో సులువుగా అడుగు పెట్టచ్చని తెలుస్తుంది. అప్పటికే ఇండస్ట్రీలో అవకాశాలు లేక బుల్లితెరపై జడ్జిలుగా అడుగుపెట్టి బాగా సందడి చేశారు నటి ప్రియమణి, సదా. దీంతో వీరికి బుల్లితెరపై బాగా క్రేజ్ రావడంతో వీరికి సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టే అదృష్టం వచ్చింది.

 

అంతేకాకుండా జబర్దస్త్ లో ఇంద్రజ కూడా జడ్జిగా చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుందని తెలిసింది. ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల నుండి తన డాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తున్న లయ కూడా రెండు సినిమాలలో అవకాశాలు అందుకున్నట్టు తెలిసింది. మొత్తానికి సోషల్ మీడియాతో, బుల్లితెరతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తున్నారు ఒకప్పటి హీరోయిన్ లు . దీనిని బట్టి అర్థమయింది ఏంటంటే.. సినిమా ఆఫర్లు రావాలి అంటే కచ్చితంగా సోషల్ మీడియాలో, బుల్లితెరలో అడుగు పెట్టాల్సిందే అని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -