Tharun: నలుగురు స్టార్ హీరోయిన్ల జీవితాలను తరుణ్ నాశనం చేశాడా.. తరుణ్ ఇలాంటి వ్యక్తా?

Tharun: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు తరుణ్. ముఖ్యంగా లవ్ కీ సంబంధించిన సినిమాలలో నటించి లవర్ బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా చాలా సెంటర్లలో ఏడాది పాటు ఆడింది.

కొన్నిచోట్ల అయితే 500 రోజులు కూడా ఆడి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా నువ్వే కావాలి – ప్రియమైన నీకు,నువ్వు లేక నేను లేను, నువ్వే న‌వ్వే లాంటి సూపర్ డూపర్ హిట్లతో తరుణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోలు ఉన్నా కూడా తరుణ్ డేట్ల కోసం స్టార్ నిర్మాతలు ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అంత స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్న తరుణ్ చిన్న చిన్న రాంగ్ స్టెప్పులతో ఒక్కసారిగా పాతాళంలో పడిపోయాడు. ఇందుకు తరుణ్ సొంత తప్పిదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్తో తరుణ్ ప్రేమాయణం తరుణ్ కెరీర్ కి శాపంగా మారిందని అంటారు. ఒకవేళ తరుణ్ ఆర్తిని పెళ్లి చేసుకునే ఉంటే ఆర్తితో పాటు తరుణ్ కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని కూడా అంటూ ఉంటారు.

 

అప్పట్లో తరుణ్‌తో నటించేందుకు స్టార్ హీరోయిన్లు కూడా వెంటపడేవారట. ముఖ్యంగా ఏఎం రత్నం నిర్మించిన నీ మనసు నాకు తెలుసు సినిమాలో త్రిష, ఇటు ఆర్తి అగర్వాల్, శ్రేయ, ప్రియమణి లాంటి హీరోయిన్లు కూడా తరుణ్ పక్కన నటించారు. తరుణ్ కుర్ర హీరో అయినా కూడా అతడి పక్కన నటించడంలో చాలా కంఫర్టబుల్ గా ఫీలయ్యేవారట ఆ స్టార్ హీరోయిన్లు. త‌రుణ్‌తో నటించిన హీరోయిన్లు తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ అయి టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అందుకే అప్పటి కుర్ర హీరోయిన్ లు స్టార్ హీరోయిన్లు అందరూ తరుణ్‌తో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునేవారట. అంతెందుకు త్రిష లాంటి హీరోయిన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. శ్రేయ కూడా పెళ్ల‌య్యి బిడ్డ త‌ల్లి అయినా కూడా అడపా సినిమాలు చేస్తోంది. ప్రియమణి కూడా వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది. కానీ హీరో తరుణ్ మాత్రం సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -