S. S. Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆస్కార్ తో సాధించింది ఇదేనా?

S. S. Rajamouli: తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లోనినాటు నాటు పాటకు ఆస్కా ర్ రావడంతో భరత భూమి పులకించింది. ప్రధాని నుంచి ప్రముఖల వరకు అందరూ ఆ సినిమా టీంకు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ అవార్డు కడుపునిండిన వాడికి సంతోషం కలిగించినా, కడుపు కాలుతున్న మన తెలుగు సినీ పేద కార్మికలకు మాత్రంసంతోషం ఏ మాత్రం కలిగించలేదు.

సినీ పరిశ్రమలో ఎంతో మంది నిరుపేదలు మగ్గిపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మనలాంటి పేద దేశాలకు ఇలాంటి అవార్డులు పట్టవు ప్రభుత్వం కొలువుతో కడుపు నిండిన దేవులపల్లి కృష్ణశాస్త్రి భావ కవిలు రాసి ఊహల్లో విహరించేవారు. కొలువు లేక కాలే కడుపుతో తిరిగే శ్రీ శ్రీ రగిలిపోయి ఆ కవితలు ఎవడికి కావాలి.. కార్మికుల కష్టాల గురించి ఆలోచించు దేవులపల్లి అని ఎన్నో సార్లు ఎద్దేవా చేసేవారు. అందుకే శ్రీ శ్రీ మహా కవి అయ్యారు.

 

ఈ అవార్డుల కోసం రాజమౌళి నిర్మాతలతో పెట్టించిన ఖర్చు తడిసి మోపెడు అయ్యింది. ఇప్పటివరకు దాదాపు రూ. 120 కోట్లు అయిపోయినట్లు తెలిసింది. అంటే ఈ డబ్బుతో దాదాపు 120 చిన్న సినిమాలు తీయవచ్చు. కొన్ని వేల మంది తెలుగు కార్మికులకు పని దొరికేది. 100 సినిమా ధియేటర్లు నిండేవి. 50 కోట్ల
జనం 120 కొత్త తెలుగు సినిమాలు చూసి ఆనందించే వాళ్లు.

 

అయితే ఆర్ఆర్ఆర్ తోపాటు ఇదే రోజు మన దేశానికి చెందిన ది ఎలిఫెం ట్ విష్పె రేర్స్ షాట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఉత్తమత్త చిత్రంగా తొలిసారి ఆస్కార్ అవార్డు సంపాదించుకుంది. కానీ ఈ సినిమా దర్శ క, నిర్మాతలు అప్లికేప్లిషను ఫీజు తప్పా నయాపైస ఖర్చు చేయలేదు. ఆ మాటకొస్తే ప్రమోషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. మన సినిమా బాగుంటే ఆస్కార్ అవార్డు దానికదే వెతుంటూ వస్తుంది అనే ధీమాతో ఉన్నారు. ధీమా అంటే అలా ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -