Cuddalore: దారుణం.. చేసిన పనికి చూపు కోల్పోయిన కోడలు?

Cuddalore: రాను రాను సమాజంలో ఆడవారి పరిస్థితి దారుణంగా తయారవుతోంది. బయటకు వెళ్లాలి అంటే కామాంధుల దెబ్బకు భయపడి ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో కూడా తండ్రి అన్నల నుంచి ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. అలాగే ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి అన్న కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. భర్త అత్తమామలు అందరూ కలగలసి కోడళ్లను వరకట్నపు వేధింపులు ఇతర విషయాలలో వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కోటి ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆడపిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి.

కూతురిలా చూసుకోవాల్సిన కోడల్ని ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు బంధువులే రాబంధువులుగా మారుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని కడలూరు జిల్లా వృద్ధాచలంలో ముఖేష్ రాజ్ కుటుంబం నివాసమం ఉంటోంది. ముఖేష్ కి ఏడేళ్ల క్రితం కృతిక అనే యువతితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ముఖేష్ రాజ్ అతడి అమ్మ ఆండాళ్‌తో కలిసి ఉంటున్నారు. ముఖేష్ తిరుప్పూర్‌ లోని అవినాసిలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటూ సెలవులకు ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే కోడలి కృతిక ప్రవర్తన పై అత్తకు అనుమానం ఏర్పడింది.

 

ఈ విషయం పై వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవలు తారా స్థాయికి చేరడంతో కోడల్ని చంపేయాలని ముఖేష్ తల్లి భావించి ఇంట్లో నిద్రిస్తున్న కోడలిపై యాసిడ్‌తో దాడి చేసింది అత్త ఆండాళ్. మరుగు దొడ్లో ఉన్నయాసిడ్‌ను తీసుకువచ్చి నిద్రిస్తున్న కోడలి శరీర భాగాలపై పోసింది. ముఖం, కళ్లు, చెవులు, ప్రైవేట్ పార్ట్స్ పై పోసింది. అలాగే నోటిలో దోమల మందు పోసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే కృతిక అరుపులు, ఏడుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వృద్దాచలం హాస్పిటల్ నుంచి కడలూరు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి చేయడంతో కృతిక కంటిచూపును కోల్పోయింది. శస్త్ర చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. కృతిక ఫిర్యాదుతో అత్త ఆండాళ్‌ను అరెస్టు చేసిన పోలీసులులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -