Ileana: ఆ సినిమా వల్ల ఇలియానా మళ్లీ టాలీవుడ్ దర్శకుల కళ్ళల్లో పడనుందా?

 Ileana: టాలీవుడ్ ప్రేక్షకులకు గోవా బ్యూటీ ఇలియానా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఒక రేంజ్ లో కట్టిపడేసింది. అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఇలియానాకు మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత గోవా బ్యూటీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా.. వరుస సినీ ఆఫర్లను తన సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది.

ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. అలా అప్పట్లో తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోయే క్రమంలో ఈ గోవా బ్యూటీ కి బాలీవుడ్ లో కూడా కొన్ని ఛాన్సులు వచ్చాయి. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి స్కిప్ అయ్యి బాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పించబోయే ప్రయత్నం చేసింది. నిజానికి ఈ తొందరపాటే ఈ అమ్మడికి బెడిసి కొట్టింది అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్లో ఆఫర్లు వచ్చినా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

అప్పటినుంచి అటు బాలీవుడ్ కి ఇటు టాలీవుడ్ కి దక్కకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు 4k ఫార్మాట్లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పోకిరి సినిమా విడుదలై వేరే స్థాయిలో వసూలు చేసింది. ఈ క్రమంలో ప్రేక్షకులు ఇలియానాను గుర్తుకు తెచ్చుకున్నారు.

ఇక ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను ప్లాన్ చేశారు. కాబట్టి ఇలియానా అందాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాయి. ఇలా 4k ఫార్మాట్ సినిమాల ద్వారా ఇలియానా మళ్లీ డైరెక్టర్ల కళ్ళకు చిక్కుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అదృష్టం ఏ విధంగా ఉందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -