Ram Charan: చరణ్ నిజస్వరూపం బయటపెట్టిన ప్రొడక్షన్ మేనేజర్.. ఏమైందంటే?

Ram Charan: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు మెగా హీరో రామ్ చరణ్. తండ్రి హోదా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత తనకంటే హీరోగా ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కొన్ని హిట్లతో పాటు ఫ్లాప్ లు కూడా ఎదుర్కొన్నాడు. అయినా కూడా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు కదిలాడు.

ఇక ఆ మధ్యనే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక రామ్ చరణ్ ఒక నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన దగ్గరికి వచ్చిన అభిమానులను ఇబ్బంది పెట్టకుండా వారిని దగ్గరకు తీసుకొని పలకరిస్తూ ఉంటాడు.

 

అయితే అటువంటి రామ్ చరణ్ గురించి ఓ ప్రొడక్షన్ మేనేజర్ షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇంతకూ ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరంటే దీప్తి. ఇప్పటికే ఆమె తలైవి, పొన్నియన్ సెల్వన్, వినయ విధేయ రామ వంటి సినిమాలకు పనిచేసింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టింది. ఆమెకు ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో అవకాశం వచ్చిందని.. అది కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది.

 

ఇక తను మొదట్లో ఇండస్ట్రీలో చిన్న చూపు, చిత్కారాలు ఎదుర్కొన్న కూడా చివరికి లైన్స్ మేనేజర్ గా చేరుకున్నాను అని తెలిపింది. వర్కింగ్ యూనియన్ లో మెంబర్గా చేరి ప్రొడ్యూసర్ల ఈమెయిల్ ఐడి లను సేకరించి పని ఇవ్వమని అడిగేవారట. అలా మొదలైన ప్రయాణంలో వినయ విధేయ రామ లాంటి పెద్ద ప్రాజెక్టు చేశానని తెలిపింది. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు రామ్ చరణ్ తో ఒక ఫోటో తీసుకోవాలని వెళ్తే.. అప్పుడు మరో వ్యక్తి తనను లైన్ మేనేజర్ అని పరిచయం చేసి.. మీ మీదకు ఎవరు రాకుండా వంటి చేత్తో ఆపింది ఈవిడే అంటూ చరణ్ కు పరిచయం చేశాడట.

 

వెంటనే చరణ్ లేడీ మేనేజర్స్ రావడం చాలా బాగుంది అని.. మీలాగా ఎంతోమంది ఇంకా ఇండస్ట్రీకి ఆడవాళ్లు రావాలి అని పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని ప్రశంసించాడని.. అది ఎప్పటికీ మర్చిపోను అని తెలిపింది. తనకు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాకు అవకాశం వచ్చిందని.. ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్తే వేరే వాళ్లకు ఇచ్చేసామని అనటంతో చాలా బాధ అనిపించిందని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -