Allu Aravind: ఆ విషయంలో అల్లు అరవింద్ ను మించిన వ్యక్తే లేరా?

Allu Aravind: టాలీవుడ్ హీరో బాలయ్య బాబు మొట్ట మొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన షో అన్‌స్టాపబుల్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ప్రసారమయ్యి రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని రాబట్టిని విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఓటీటీ సంస్థ ఆహా తాజాగా బాలయ్య బాబుతో కలిసి గాలా విత్ బాలా పేరుతో షో చేసింది. కాగా అన్‌స్టాపబుల్‌ షోకి బాలయ్యను హోస్ట్‌గా చేసి తొలి హిట్‌ కొట్టిన ఆహా టీమ్‌ ఆ తర్వాత వరుసగా ఇలాంటి షోలు చేస్తూ వస్తోంది.

ఆహా ఓటీటీకి బాలయ్యను ఏకంగా బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేసేసిందనే చెప్పవచ్చు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ జరుగుతోంది మాత్రం ఇదే అని చెప్పవచ్చు. ఇండియన్‌ ఐడల్‌ 2 కొత్త ఎపిసోడ్‌ కోసం బాలయ్యను బాగానే వాడేసుకున్నారు.. అన్‌స్టాపబుల్‌ షోకి సంబంధం లేకుండా మధ్యలో బాలయ్యను సింగర్స్ షో అయిన ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1కి గెస్ట్‌గా తీసుకొచ్చారు. ఇప్పుడు మరోసారి అదే షోకి తీసుకొచ్చారు. అయితే ఈసారి గాలా విత్‌ బాలా అనే పేరు పెట్టారు.

 

ఇందులో ఓ సాంగ్‌కి బాలయ్య డ్యాన్స్‌ కూడా చేశాడు. ఇదంతా చూస్తుంటే బాలయ్యను ఆహా బాగానే వాడుకుంటోంది అని అర్థమవుతోంది. అంతేకాకుండా బాలయ్య బాబుని అల్లు అరవింద్ వాడినట్లుగా మరెవరు వాడలేరు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఓటీటీలో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య బాబు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -