Chinmayi Sripada: హీరోయిన్ మీరా చోప్రాకు అండగా చిన్మయి!

Chinmayi Sripada: మీటూ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు సింగర్ చిన్మయి. ఈమె ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున వివాదం సృష్టించి తరచు వార్తలు నిలుస్తుంటారు. ఇలా మీటు ఉద్యమం అనంతరం ఈమె సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలను దాడులపై స్పందిస్తూ తరచూ వారికి మద్దతుగా నిలబడుతుంటారు.ఇలా మహిళలకు మద్దతుగా నిలబడుతున్న క్రమంలోనే ఈమెపై పలువురు దాడికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా మహిళల పక్షాన మాట్లాడే సింగర్ చిన్మయి ఎంతోమంది ట్రోలింగ్ కిగురైంది. అయితే వాటి గురించి తానేమి పెద్దగా పట్టించుకోనని ఈమె వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీల గురించి వారి అభిమానుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అందరి గురించి తెలుసుకోవాలని ఏమీ లేదు. ఒకరి గురించి తెలియదని చెబుతున్నారు అంటే వారు నిజాయితీగా ఒప్పుకున్నట్లే తెలియకపోతే తెలుసుకుంటారు.

ఇలా తెలియదంటేనే వారిపై పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మంచిది కాదంటూ ఈమె వెల్లడించారు. అయితే గతంలో నటి మీరా చోప్రా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ చేసిన వ్యాఖ్యల పై తారక్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలియదు అనడంలో నేరం లేదు తనకు తెలియకపోతే తెలుసుకుంటారు కానీ ఇలా ట్రోల్ చేయడం సరైనది కాదు.

అదేవిధంగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున గొడవలు పడుతుంటారు. అయితే హీరోలపై మీకు అభిమానం ఉండొచ్చు కానీ హీరోల గురించి గొడవ పడుతూ వారి ఇంట్లో ఉండే మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ఇలా మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు అంటూ ఈమె తెలిపారు. ఇక ఒక వ్యక్తి ఒకరి గురించి తెలియదని చెబితే తప్పేం కాదు అక్కడ వారు అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పారు. ఇలా నిజాయితీగా చెప్పిన వారిపై ఇతరులు ఎమోషనల్ రియాక్ట్ కావడం అనేది వారి ఇమ్మెచ్యూరిటీనీ తెలియజేస్తుందని ఈ సందర్భంగా చిన్మయి కామెంట్స్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -