Tollywood: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీలలో ఈ సినిమాలు రిలీజవుతున్నాయా?

Tollywood: సాధారణంగా ప్రతి శుక్రవారం సినిమా హీరోలకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే దాదాపు అన్న సినిమాలు శుక్రవారం రోజున మాత్రమే విడుదల చేస్తారు. అలాగే ఏదైనా పండుగలో ప్రత్యేక సందర్భాల కారణంగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఉగాది సందర్భంగా కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల కానుండగా మరికొన్ని ఓటీటీ లలో విడుదల అవుతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

• నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “దసరా” సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

 

• అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ చాలాకాలం తర్వాత “రంగమార్తాండ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

• యంగ్ హీరో విశ్వక్ సీన్ ఇటీవల పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు విస్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన “దాస్ కా ధమ్కి” సినిమా ద్వారా ఉగాది బరిలో నిలిచాడు.

 

• ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ ఉగాదికి ప్రేక్షకులను అలరించటానికి సిద్దం అయ్యింది. కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ” కోస్టి” సినిమా ఉగాదికి థియేటర్ లలో విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -