OTT movies: ఈ ఓటీటీ సినిమాల ప్రత్యేకతలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

OTT movies: ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి సినిమాను చూడడం కంటే ఓటీటీలోనే సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. పెద్దపెద్ద స్టార్ హీరోల కోసం మాత్రమే సినిమా థియేటర్ లోకి వెళ్తున్నారు. అందుకు తగ్గట్టుగా థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలు రెండు వారాలు కూడా పూర్తిగా ముందే ఓటీటీ లోకి విడుదల అవుతుండడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ కీ పరిమితమవుతున్నారు. ఇకపోతే ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లను విడుదల చేస్తున్నాయి. దాంతో ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఓటీటీ లకు అలవాటు పడిపోయారు.

థియేట్రికల్ సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అలాగే వేర్వేరు భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి ఓటీటీ లోకి విడుదల చేస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోనే కాకుండా ఓటీటీ కంటెంట్ లో కూడా మార్పులు వచ్చేశాయి. థియేటర్స్ లో ఎలా అయితే అన్ని రకాల జానర్స్ కథలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారో ఓటిటిలో ఇంకా వెరైటీ జానర్స్ టచ్ చేస్తున్నారు. ఓ రకంగా బోల్డ్, అడల్ట్ కంటెంట్ సైతం టచ్ చేస్తున్నారు. ఓటీటీ కచ్చితంగా చూడాల్సిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ. ఈ తెలుగు మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ తెలుగు సినిమా ప్రస్తుతం జీ5 లో ప్రసారమవుతోంది.

 

అలాగే ది వేల్ అనే ఇంగ్లీష్ సినిమా సోనిలివ్ లో ప్రసారం అవుతుంది. ది మెజీషియన్స్ ఎలిఫెంట్ అనే ఇంగ్లీష్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఇరాట్ట అనే తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే తెలుగు సినిమా సోనిలివ్ లో ప్రసారం అవుతోంది. వసంత కోకిల అనే తెలుగు మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అదేవిధంగా క్రిస్టోఫర్ అనే తెలుగు సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రన్ బేబీ రన్ అనే తెలుగు మూవీ కూడా హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక తెలుగు వెబ్ సిరీస్ కూడా జీ5 లో ప్రసారం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -