NTR: సోలో హీరోగా తారక్ పాన్ ఇండియా హిట్ సాధిస్తారా?

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కొరటాల శివ ఎన్టీఆర్ కీ ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఒకవైపు సోలో హీరోగా పాన్ ఇండియా సినిమా చేయాలన్నది తారక్ కల అయితే పాన్ ఇండియా డైరెక్టర్గా మారాలి అన్నదే దర్శకుడు కొరటాల శివ కల కూడా. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇద్దరికీ ఇది ఓ కల. ఓ డ్రీమ్ ప్రాజెక్ట్.

 

పోయిన తన పరువును నిలబెట్టుకోవాల్సి వుంది కొరటాల. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన తన పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి వుంది. అయితే ఇవన్నీ కూడా ఈ ఒక్క సినిమాపై ఆధారపడి వున్నాయి. దీంతో కొరటాల శివకు మరింత శ్రమ పెరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఎన్టీఆర్ సోలో హీరోగా పాన్ ఇండియా సినిమా చేసి సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -