Samantha: దేవుడా.. సమంత నగల కోసం ఏకంగా అన్ని రూ.కోట్లు ఖర్చు చేశారా?

Samantha: సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా శాకుంతలం. ఈ మూవీ త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడు పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను చెప్పేశారు.

శాకుంతలం కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. దాన వీర శూరకర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించినట్లు గుణశేఖర్ వెల్లడించారు.శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుం ధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు.

శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ తెలిపారు. ఇది విన్న వారంతా నోరెల్లబెడుతున్నారు. బంగారు ప్రియులు మాత్రం ఆఛాన్సు మాకెందుకు రాలేదబ్బా అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -