Rashmika: వైరల్ అవుతున్న రష్మిక సంచలన వ్యాఖ్యలు!

Rashmika: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు.

 

ఇక ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రష్మిక అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. ఇక అభిమానులు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ వచ్చారు. అయితే ఒక అభిమాని మాత్రం ఈమెను ప్రశ్నిస్తూ మీతో కలిసి నాకు సామి సామి అనే పాటకు డాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. అయితే ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ నేను ఇకపై సామీ సామీ పాటకు డాన్స్ వేయలేను. ఇప్పటికే ఈ పాటకు ఎన్నోసార్లు డాన్స్ చేశాను.

 

ఇలాగే ఈ పాటకు డాన్స్ చేస్తూ పోతూ ఉంటే వయసు పైబడిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ రావటం ఖాయం. ఇకపై నేను ఈ పాటకు డాన్స్ చేయలేను అంటూ రష్మిక చెప్పినటువంటి సమాధానం వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమాలోని ఈ పాటకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో మనకు తెలిసిందే. ఇక ఈ పాటకు ఎంతోమంది రీల్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఈ పాటకు రష్మిక డాన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేశారని చెప్పాలి. పుష్ప సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -