RRR: రేటింగ్ పరంగా రికార్డ్ సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఏమైందంటే?

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మల్టీ స్టార్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈ సినిమాలోని నటీనటులపై అలాగే సాంకేతిక నిపుణులపై హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ప్రశంసలు కురిపించారు.

ఇలా ఈ సినిమా విడుదలయి ఏడాది అవుతున్నప్పటికీ ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇలా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా అనంతరం నెట్ఫ్లిక్స్ లో ప్రసారమౌతూ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువైంది. ఇక ఈ సినిమాని చూసినటువంటి హాలీవుడ్ ప్రేక్షకులు సినిమాపై ప్రశంసల కురిపించగా అమెరికాలో ప్రత్యేక షోలు వేశారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమకే ఎంతో గర్వకారణంగా నిలిచిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా థియేటర్లలోను డిజిటల్ మీడియాలోనూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక టెలివిజన్ పై ఈ సినిమాను ఐదు సార్లు ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటిసారి ప్రసారమైనప్పుడు ఏకంగా 19.62 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక రెండవసారి టెలికాస్ట్ అయినప్పుడు 8.02 రేటింగ్ కైవసం చేసుకుంది. మూడోసారి మరింత తగ్గిపోయి 6.37% రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక నాలుగో సారి మరీ దారుణంగా 4.14 రేటింగ్ కైవసం సొంతం చేసుకుంది.

ఇకపోతే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఈ సినిమాని ఐదవ సారి బుల్లితెరపై ప్రసారం చేశారు. అయితే ఐదవ సారి ఈ సినిమాకు వచ్చిన రేటింగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐదవ సారి ఈ సినిమా ఏకంగా 8.17 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. ఇలా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సినిమా చూసే వారి సంఖ్య కూడా పెరిగిపోయిందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -