Charan NTR: చరణ్, తారక్ లలో ఎవరెక్కువో అప్పుడు తేలిపోతుందట!

Charan NTR: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం బయటపడటంతో పాటు మీ ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చరణ్, తారక్ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు ప్రాణ స్నేహితులుగా మెలుగుతూ సంతోషంగా ఉండగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఈ ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.

 

ఆర్ఆర్ఆర్ సినిమాతో అయినా ఈ ఇద్దరి హీరోల అభిమానులు మధ్య ఉన్న కోపాలు తగ్గి దగ్గరవుతారు అనుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వీరి మధ్య వార్ మరింత పెరిగింది. సినిమా విడుదలైన తర్వాత కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలను పేల్చుకుంటూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్ చెర్రీ అభిమానుల మధ్య ఒక విషయం గురించి పెద్దగానే చర్చలు కొనసాగుతున్నాయి.

అదేమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మార్కెట్ను సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు తర్వాత సినిమాలతో ఎవరు బాక్సాఫీస్ వద్ద ఆ పేరు నిలబెట్టుకుంటారు అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చెర్రీ ఆశలన్నీ కూడా ఆ సినిమా పైన పెట్టుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 

ఆ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఇద్దరు హీరోలు సినిమాలు వచ్చే ఏడాది మూడు నెలల గ్యాప్ తో విడుదల కానున్నాయి. చరణ్ వర్సెస్ తారక్ అన్నది అప్పుడు చూసుకుందాం అని, చరణ్ గొప్పనా లేక ఎన్టీఆర్ గొప్పన అన్నది అప్పుడు చూసుకుందాం అని అంటున్నారు అభిమానులు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -