Bhanu Sri Mehra: వైరల్ అవుతున్న వరుడు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Bhanu Sri Mehra: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన లేదంటే పెళ్లిళ్లు చేసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన కూడా వారికి సినిమా అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్లకు కాస్త ఏజ్ అయిపోగానే హీరోయిన్గా అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్నా కూడా అందం అలాగే ఉన్న హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లు లేదంటే ఇతర ఆఫర్లు మాత్రమే వస్తూ ఉంటాయి.

సినిమా ఇండస్ట్రీలో ఇదే ట్రెండు ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ హీరోలు మాత్రం ఆరు పదుల వయసు దాటినా కూడా హీరోలుగా రాణిస్తూ సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఇదే విషయంపై గతంలో చాలామంది హీరోయిన్లు స్పందించిన విషయం తెలిసిందే. హీరోలకు ఏజ్ అయిపోయిన అవకాశాలు వస్తున్నాయి మాకు రావడం లేదు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ భాను శ్రీ మెహ్రా కూడా స్పందించింది.

 

చాలామంది భాను శ్రీ మెహ్రా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. వరుడు సినిమాతో ఒక్కసారిగా ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలలో నటించలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఏజ్ ఫ్యాక్టర్ అనేది హీరోయిన్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ హీరోలు మాత్రం ఎంత ఏజ్ వచ్చినా సరే హీరోలుగానే చేస్తూ ఉంటారు.

 

వారి కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త ఏజ్ వచ్చినా లేదంటే పెండ్లి చేసుకున్నా సరే వారికి అవకాశాలు ఇవ్వరు అంటూ ఆమె సీరియస్ గా కామెంట్లు చేశారు. కాగా ఆమె కామెంట్లకు చాలామంది పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. వరుడు హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్వు అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -