Ram Charan: ఆ హీరోయిన్ చరణ్ ను ఇంతలా అవమానించిందా?

Ram Charan: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల ఆస్కార్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ ఆస్కార్ అవార్డుని అందుకున్న తర్వాత చరణ్ ని అందరూ గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చెర్రీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. శంకర్ కూడా అందుకు అనుగుణంగానే సినిమాలోని సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే గతంలో ఒక హీరోయిన్ రామ్ చరణ్ ని పొట్టోడు అంటూ కామెంట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. అయితే అనుష్క చరణ్ ని విమర్శించడానికి అలాగే కావాలని ఆ కామెంట్ చేయలేదు. మగధీర సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రాజమౌళి వెతుకుతున్న సమయంలో అనుష్కని కూడా సంప్రదించారట. అప్పుడు అనుష్క,రామ్ చరణ్ నా పక్కన పొట్టిగా ఉంటాడు. పైగా నేను అతను అక్క తమ్ముడు మాదిరిగా కనిపిస్తాము అంటూ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట స్వీటి. అయితే గతంలో కూడా రామ్ చరణ్ తాను హైట్ తక్కువగా ఉంటానని, స్కూల్లో ఉన్నప్పుడు తన ముందు వరుసలో రానా కూర్చునే వాడని, అందువల్ల తనకు బోర్డు పై టీచర్ ఏం రాస్తున్నారో కనిపించేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -