Balayya: బాలయ్య చిన్నల్లుడి కోరిక నెరవేరడం సాధ్యమేనా?

Balayya: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తారుమారవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా గెలుపొందడంతో ప్రజలు జగన్ పార్టీ పట్ల విముఖత చూపిస్తున్నారని ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చగాలు వీస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో అధికార పీఠాన్ని అందుకోవాలని తెలుగుదేశం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే లోకేష్ పాదయాత్ర చేయడం కూడా కాస్త అనుకూలంగానే అనిపిస్తోంది. ఇక తెలుగుదేశం ప్రభుత్వం జనసేన పార్టీతో పొత్తుకు కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇలా ఈ రెండు పార్టీలు కలిపి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి తప్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు.

 

ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక 2024 లో జరగబోయే ఎన్నికలలో భాగంగా ఈయన చిన్న అల్లుడు భరత్ సైతం విశాఖ ఎంపీగా పోటీకి దిగుతున్నారు.ఇలా ఈయన వచ్చే ఎన్నికలలో వైజాగ్ లో ఎంపీగా పోటీ చేసి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లోఅధికార పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని అందుకే తాను గెలుస్తాననే ధీమా తనకు ఉంది అంటూ తెలియజేశారు.

 

ఇక వైజాగ్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్ ఈ మూడింటిని సక్సెస్ చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అందుకే పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది అని ఈయన తెలియజేశారు.ఇలా పలు విద్యాసంస్థలను నడిపిస్తున్నటువంటి భరత్ వచ్చే ఎన్నికలలో తాను వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నాను అంటూ తెలియజేయడమే కాకుండా తప్పకుండా గెలుస్తాననే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగానే ఈయన వచ్చే ఎన్నికలలో ఎంపీగా బాధ్యతలు తీసుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -