NTR: దిల్ రాజు కెరీర్ లో సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ కారణమా?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే నిర్మాతగా దిల్ రాజు కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు. కెరియర్ మొదట్లో ఈయన డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ అనంతరం నిర్మాతగా మారి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అయ్యారు.ఇలా ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే గతంలో దిల్ రాజు ఎన్టీఆర్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఆది. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా2002 మార్చి 8వ తేదీ విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి 21 సంవత్సరాలు పూర్తి కావడంతో గతంలో ఈ సినిమా గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందు ఈయనకు వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఇక తన ఆఫీసు మూసేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలియజేశారు.అదే సమయంలోనే ఎన్టీఆర్ ఆది సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయగా తమకు మంచి లాభాలు వచ్చాయని ఈ సినిమా చూసిన తర్వాత నిర్మాతగా మారాలన్న బలం కూడా తనలో అధికమైందని తెలిపారు.

 

ఇందులో వినాయక్ గారు రెండు సీన్లను చూపించారు ఆ సీన్లు చూడగానే తాను దిల్ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చి నిర్మాతగా మారిపోయానని తెలిపారు. ఇలా ఆరోజు ఎన్టీఆర్ ఆది సినిమా లేకపోతే ఈరోజు దిల్ రాజు లేరనీ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి అలాగే నిర్మాతగా మారడానికి కూడా ఎన్టీఆర్ కారణమని తెలియడంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -