Amala Akkineni: అమల బంగారం వేసుకోకపోవడం వెనుక అసలు కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Amala Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి అమల ఒకరు.బెంగాలీ అయినటువంటి అమల భరతనాట్యకారిని కావడంతో పలు చోట్ల స్టేజి షో చేయటం వల్ల ఈమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. ఇలా తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమల నాగార్జునతో ప్రేమలో పడ్డారు.

ఇలా నాగార్జునతో ప్రేమలో ఉన్నటువంటి ఈమె 1992లో నాగార్జునను వివాహం చేసుకున్నారు.వీరి వివాహం తర్వాత అమల పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. అలాగే మూగజీవాలపై ఎంతో ప్రేమ ఉన్నటువంటి ఈమె బ్లూ క్రాస్ కోసం పని చేస్తూ ఉన్నారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి అమల తిరిగి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మనం ఒకే ఒక జీవితం వంటి సినిమాలలో కూడా సందడి చేశారు.

 

ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన అమలను మనం ఎప్పుడు ఏదైనా ఈవెంట్లో చూసినా కూడా చాలా సింపుల్ గా చీర కట్టుకొని మెడలో చిన్న నల్లపూసల దండ వేసుకొని మాత్రమే కనిపిస్తారు.ఎన్నో వేలకోట్ల ఆస్తులు ఉన్నటువంటి అమల ఎప్పుడు కూడా రిచ్ గా బంగారు ఆభరణాలను వేసుకొని మాత్రం కనిపించరు. ఎప్పుడు చూసిన ఈమె సింపుల్ గా ఉండడంతో అసలు అమల బంగారం ధరించకపోవడానికి కారణం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు.

 

ఇలా వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అమల చాలా సింపుల్ గా నల్లపూసలు వేసుకోవడానికి గల కారణం ఆమెకు బంగారం అంటే అలర్జీ కావడమే. ఈమె బంగారు నగలను కనుక ధరిస్తే వెంటనే చర్మం మొత్తం ఎర్రగా కందిపోయి రాషేష్ వస్తాయట అందుకే ఈ అలర్జీ కారణంగా బాధపడటం కంటే బంగారం వేసుకోకపోవడమే మంచిదని భావించిన అమల ఎప్పుడు చూసినా మనకు నల్లపూసలు వేసుకుని మాత్రమే కనిపిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -