Prabhas: ప్రభాస్ కు మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఎలా జరిగిందంటే?

Prabhas: తెలుగు సినిమా ఇండ్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు.సంపాదించుకున్నారు అనంతరం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ రావడంతో ప్రభాస్ రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం సౌత్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది ఈ సినిమా తర్వాత పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిన రాధే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.ఇలా బాహుబలి తర్వాత రెండు పాన్ ఇండియా సినిమాలు డిజాస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు.

 

ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తే సాధారణంగా ఏ హీరో కైనా తన క్రేజ్ తగ్గుతుంది కానీ ప్రభాస్ విషయంలో మాత్రం వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ ఆయన క్రేజ్ అంతకు అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇలా తన సినిమాల కారణంగా అభిమానులు డిసప్పాయింట్ కావడంతో ప్రభాస్ తన సినిమాలో సెలక్షన్ దగ్గర నుంచి సినిమాలపై హైప్ క్రియేట్ ప్లాన్ చేశారు. అదే ఇప్పుడు ప్రభాస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది.ఇలా ప్రభాస్ వరుస డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడం ఒక ప్రభాస్ కి మాత్రమే చెల్లిందని చెప్పాలి.

 

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారు. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగ మారుతి డైరెక్షన్ లో కూడా ప్రభాస్ సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఏడాది ఈయన నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -