Pregnancy: పీరియడ్స్ సమయంలో సెక్స్.. గర్భం వస్తుందా? రాదా?

Pregnancy: మహిళలకు ప్రతినెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. అయితే పీరియడ్స్ వచ్చిన సమయంలో కొందరు మహిళలకు కడుపు నొప్పిగా అనిపించడంతోపాటు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో అనేక రకాల అపోహలు సందేహాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా సెక్స్ విషయంలో అనేక రకాల అపోహలు ఉంటాయని చెప్పవచ్చు. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

చాలామంది పీరియడ్స్ సమయంలో దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపడుతూ ఉంటారు. కొంతమంది పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందా అని భయపడుతూ ఉంటారు. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సమయంలో కలవచ్చా లేదా అంటే కలవవచ్చు కానీ అందుకు భాగస్వామి అంగీకారం ఉండటం మంచిది.

 

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు తక్కువ. అలా అని అసలు రాదు అని కూడా చెప్పలేం. కొందరికి రుతక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన పీరియడ్స్ అవునో కాదో లోపల అండం విడుదలైందో లేదో గుర్తించడం కష్టం. కాబట్టి కచ్చితంగా గర్భం రాదు అని మాత్రం చెప్పలేం. కొంతమందికి నెలసరి సక్రమంగా వస్తూ ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా తేదీ కూడా మారదు వాళ్ల విషయంలో వారికి మాత్రం పీరియడ్స్ లో శృంగారం చేసినా గర్భం రాదు.

 

అయితే పీరియడ్స్ సమయంలో కలయిక ఇద్దరికీ ఇష్టపూర్వకమైతేనే పాల్గొనాలి. కొందరు మహిళలకి పీరియడ్స్ సమయంలో చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. పీరియడ్స్ లో రక్త స్రావం బయటకు వస్తూ ఉంటుంది. దానికి తోడు యోని మృదుత్వం కోసం సాధారణంగా సంభోగం సమయంలో వెలువడే స్రావాలు పీరియడ్స్ సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. దాని కారణంగా అంగ ప్రవేశం చేసే సమయంలో నొప్పి ఉండే అవకాశం ఉంది. అయితే… పీరియడ్స్ నొప్పిని కలయిక ద్వారా తగ్గే అవకాశం ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -