Amala: అమల అలా అనడం వల్లే సమంత ఇంతలా హర్ట్ అయ్యారా?

Amala: సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినా ఈ జంట గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. విడాకులు తీసుకుని కూడా చాలా నెలలు అవుతుంది. అయినా అభిమానులు, మీడియా మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. దీని గురించి ప్రతి చిన్న విషయం కూడా ట్రెండింగ్‌గా మారుతూ ఉంటుంది. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత ఎవరికివారు సినిమాలు చేసుకుంటున్నారు.

ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. సమంత ముంబైకు చెక్కేసి హిందీ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల శాకుంతలం సినిమాలో నటించగా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సమంత తొలిసారి మీడియా వేదికగా స్పందించింది.

 

తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. తాను తప్పు చేయనప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించింది. అయితే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అక్కినేని ఫ్యామిలీపై సమంతకు ఉన్న కోపమేననే ప్రచారం జరుగుతోంది. అలాగే సమంతకు అమల కొన్ని కండీషన్లు పెట్టిందని, అందులో కూడా అమలకు చైతు సపోర్ట్ చేశాడని చెబున్నారు. సమంతకు అదీ నచ్చకే బాగా హార్ట్ అయిందని, సమంత మానసికంగా ఆవేదనకు గురై చైతూకు దూరమైందని అంటున్నారు.

 

వేసుకునే బట్టలు, సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ పాత్రలు చేసే విషయంలో కొన్ని కండీషన్లు అమల పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. అయినా సమంత బోల్డ్ పాత్రలలో నటించడంతో అమల వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫ్యామిలీ మీటింగ్ పెట్టి సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అమల టార్చర్ భరించలేకనే చైతుకు సమంత దూరమైందనే చర్చ జరుగుతోంది.లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సమంతను అమల టార్చర్ చేశారని, దుస్తులు, సినిమాల విషయంలో కండీషన్లు పెట్టినట్లు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -