Actor: ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ తో టాలీవుడ్ సినిమాలలో కూడా విలన్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందిన మనోజ్ ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. రాజ్, డీకే (Raj & DK) దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి పలు ప్రాంతీయ భాషల్లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మొదటి సీజన్ మంచి హిట్ అవగా రెండవ సీజన్ కూడా విడుదల చేశారు. అది కూడా సూపర్ హిట్‌గానే నిలిచింది. ఇలా వరుసగా వెబ్ సిరీస్, సినిమాలలో నటిస్తూ మనోజ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ తన భార్య మతం గురించి మాట్లాడుతు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనోజ్ ముస్లిం యువతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూలో..’ మీ మీ ఇద్దరి మతాలు వేరు కావడం వల్ల ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగటం లేదా అని యాంకర్ ప్రశ్నించగా..మనోజ్ స్పందిస్తూ.. మా వివాహం మతం కంటే విలువలకు సంబంధించినది. నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. ఆమె ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. అయితే మా వివాహానికి మతం అడ్డు కాలేదు. ఆమె ముస్లింగా గర్విస్తుంది. నేను హిందువుగా గర్విస్తాను. కానీ మతం వల్ల ఒకరితో ఒకరం గొడవ పడము ’ అని సమాధానం చెప్పాడు.
అలాగే ‘చాలా మంది నా భార్య మతం గురించి నాతో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఎవరైనా నాతో అలా మాట్లాడితే నేను స్పందించే విధానం వేరే విధంగా ఉంటుందని వారికి తెలుసు. అందుకే చాలామంది ఇప్పటికీ నా కోపం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు’ అని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా మనోజ్ వాజ్ పాయ్ తన భార్య మతం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.