Vehicle: వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడానికి గల కారణం ఇదే?

Vehicle: నిమ్మకాయను కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా ఆర్థికపరమైన విషయంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూజా సమయంలో, నరదిష్టి పీడ విరగడం, ఇతర సందర్భాలలో నిమ్మకాయను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే మాములుగా నిమ్మకాయలను వ్యాపార స్థలాలలో ఇళ్లకు పైన కడుతూ ఉంటారు..అలాగే కొన్ని వాహనాలకు కూడా ఈ నిమ్మకాయలు ఒట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయలు లాంటివి కడుతూ ఉంటారు.

కొత్త వాహనం లేదంటే వాహనాన్ని శుభ్రం చేసి పూజ చేసే సమయంలో వాహనాల టైర్ల కింద నిమ్మకాయలను పెడుతూ ఉంటారు. కానీ కొత్త వాహనం అలాగే వాహనానికి పూజ సమయంలో ఈ నిమ్మకాయలను ఎందుకు పెడతారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కొంతమంది తెలుసుకోవాలి అనుకోగా మరి కొందరు దాంతో పని ఏముంది అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక సైన్స్ దాగి ఉంది. ఆ వివరాల్లోకి… పూర్వం రోజుల్లో ఇన్ని వాహనాలు ఉండేవి కాదు. కేవలం ఎద్దులు గుర్రాలతో నడిచే వాహనాలు మాత్రమే ఉండేవి.

ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల గుర్రాలు ఎద్దుల పాదాలకు గాయాలు ఏర్పడి అవి చాలా అవస్థలు పడేవి. కాబట్టి బయళ్దేరే ముందే వాహనాలను టైర్ల కింద అంటే అప్పటి గుర్రాలు, ఎడ్ల పాదాల కింద నిమ్మకాయలు ఉంచే వారట. అవి ఆ నిమ్మకాయలను తొక్కినపుడు అందులోని రసం వాటి పాదాల్లోకి పోయి ఏమైనా ఉంటే శుభ్రం చేసేదట. ఆ నిమ్మకాయ రసం ఆ మూగజీవాల పుండ్లు మానేందుకు తోడ్పడు తుంది. అదే ఆచారం ఇప్పుడు పెట్రోల్ తో నడిచే వాహనాలకు కూడా కొనసాగిస్తున్నారు. అలాగే బండికి, ఇంటికి ముందు భాగంలో పచ్చి మిరప కాయలు, నిమ్మకాయలు కడతారు. ఇలా నిమ్మకాయలు, పచ్చిమిర్చిని కాటన్ దారానికి కట్టడం వల్ల వాటిల్లో ఉండే గాటు, కొన్ని రకాల న్యూట్రియన్స్ ని కాటన్ దారం పీల్చుకొని బయటకు వదులుతుంది. దీంతో ఇంటి లోపలికి చీమలు, దోమలు వంటి కీటకాలు రాకుండా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -