Health Tips: తేనే నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ఫలితాలు ఇవే?

Health Tips: చాలామందికి ఉదయం లేవగానే టీ,కాఫీ తాగడం అలవాటు. టీ కాఫీ లేకపోతే రోజు కూడా గడవదు. రోజుకు కనీసం ఒక్కసారైనా టీ తాగనిదే చాలామందికి రోజు కూడా గడవదు. అంతేకాకుండా రోజులో ఒకసారి అయినా కాపీ, టీ తాగకపోతే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయిన వారిలా ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగా కాఫీ టీ ల తో పాటు గ్రీన్ టీ బ్లాక్ టీ అని కూడా తాగుతూ ఉంటారు. అయితే మనలో చాలా తక్కువ మంది మాత్రమే బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్లాక్ టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

 

అనారోగ్య సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగించే వాటిలో బ్లాక్ టీ ఒకటి. ఒత్తిడి, అలసట ఎంత ఇబ్బంది పెడుతున్న కూడా చిటికెలో తయారుచేసుకుని తాగగలిగే ఈ బ్లాక్ టీ వాటన్నింటిని పరిష్కరించి ఆరోగ్యాన్ని చిటికెలో మెరుగుపరుస్తుంది. మరి ఈ బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగితే ఏం జరుగుతుందో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరంలో టాక్సిన్ పేరుకుపోతే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

తేనెతో కూడిన బ్లాక్ టీ ప్రముఖ డిటాక్సిఫైయర్లలో ఒకటి. ఇది శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది. తేనెతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకపోవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు అనేక రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది. అన్ని జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఇది అన్ని రకాల కడుపు సమస్యలను నయం చేస్తుంది. అందుకు కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల త్వరిత ఉపశనం కలిగిస్తుంది. తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగితే రోగనిరోధక శక్త పెరుగుతుంది.

 

రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు,శరీరంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి, అటువంటి సంక్షోభాలను నివారించడానికి కృషి చేయాలి. తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులపై చాలా శ్రద్ధ ఉండాలి. కాబట్టి మీ దిన చర్యలో బ్లాక్ టీ ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు జ్వరం, జలుబు, అలసట, నీరసం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, ఒక గ్లాసు బ్లాక్ టీ ఈ పరిస్థితులను పరిష్కారం చూపగలదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -