Relationship: సెక్స్ కోరికలు పెరగాలంటే ఈ విటమిన్స్ తీసుకోవాల్సిందే?

Relationship: సెక్స్ జీవితం బాగుండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. లైంగిక జీవితం ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయసు పెరిగినా కూడా లైంగికంగా చురుకుగా ఉండాలంటే కొన్నిరకాల విటమిన్లు చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్లు తీసుకోవడం వల్ల అవి లైంగిక కోరికలను మరింత పెంచుతాయి. లైంగిక శక్తి మూలం టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇది కలగాలంటే శరీరానికి తగినంత జింక్ తప్పనిసరి.
 ఇది కోరికను పెంచడంతోపాటు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లైంగిక శక్తినీ, చైతన్యాన్ని పెంచుతుంది. పాలకూర, సెనగలు, గుమ్మడి, సన్ ఫ్లవర్ ఆయిల్, ఓస్టర్ చేపలను తరచూ తీసుకుంటే జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఒమేగా 3 ఇది వయసును తగ్గిస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. లైంగిక ప్రక్రియలో గుండె, మెదడు చాలా కీలకం. అలాగే అవిసె గింజెలు, అవిసె నూనె, సోయాబీన్, ఆలివ్ ఆయిల్, చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. జననాంగాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో విడుదలయ్యే సెక్స్ హార్మోన్లను ఇవి అనుసంధానం చేస్తాయి.
మెదడు పనితనాన్ని, గ్రహణ శక్తిని పెంచంలో కూడా బి విటమిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. నీరసం రాకుండా ఉత్తేజంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అరటి పండు, గుడ్లు, జున్ను, మాంసం వంటి వాటిల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంతో పాటు తరచూ వాల్ నట్స్, ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రోటీన్లు కలిగిన గుడ్డు మాంసం వంటివి కూడా తీసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -