Hyper Aadi: హైపర్ ఆది వల్లే టీవీ షోలపై నెగిటివ్ ఒపీనియన్.. బ్యాన్ చేస్తే బెటర్!

Hyper Aadi:హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆదిప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేయడమే కాకుండా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.ఇక హైపర్ ఆది బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు అంటే ప్రతి ఒకటి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా పలు సినిమాలలోని సన్నివేశాలను స్పూఫ్ చేశారు. అయితే హైపర్ ఆది సైతం బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమాలోని డైలాగులను చెబుతూ సందడి చేశారు. ఇలా తన డైలాగ్ డెలివరీతో ఆది ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా ఈయన మహిళలు వేసుకొనే నైటీల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఒక చీర కొనివ్వమని అడుగుతారు. కానీ చీర వేసుకుంటారా అంటే లేదు ఆ ఒక్క నైటీ వేసుకుని అన్ని పనులు చేస్తూ చివరికి నైటీతోనే మా దగ్గరకు వస్తారు అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వేశారు. అలాగే ప్రభుత్వాలకు ఈయన రిక్వెస్ట్ చేస్తూ ముందు ప్లాస్టిక్ ను కాకుండా నైటీలను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలా ఆడవారి నైటీల గురించి మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఆదిని చుట్టుముట్టి చితక్కొట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ ప్రోమో పైల్స్ స్పందిస్తూ తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కొందరు అబ్బాయిలు హైపర్ ఆది చెప్పేది నిజమే అంటూ తనకు మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం ముందు నైటీలను కాదు హైపర్ ఆదిని బ్యాన్ చేయాలి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. హైపర్ ఆది వల్లే బుల్లితెర కార్యక్రమాలపై నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడ్డాయి ముందు తనని బ్యాన్ చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -