Akira Nandan: ఫ్యాన్స్ కు కన్నీళ్లు పెట్టిస్తున్న అకీరా నందన్.. ఏం జరిగిందంటే?

Akira Nandan:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా అభిమానులు పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు.ఇలా పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖీరాను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలను అకిరా అడియాశలు చేశారు.

 

పవన్ కళ్యాణ్ వారసుడిగా ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని భావించగా ఈయన మాత్రం సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అకిరాకు నటన కన్నా సంగీతం అంటే ఎంతో ఇష్టమని ఇది వరకే పలు సందర్భాలలో తెలియజేశారు.అందుకే తాను హీరోగా కన్నా సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలోకి రావాలని భావించినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోని తాజాగా ఈయన ఒక షార్ట్ ఫిలింకు మ్యూజిక్ అందించినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రైటర్ బ్లాగ్ అనే ఓ షార్ట్ ఫిలిం కి మొట్టమొదటిసారి ఆకిరానందన్ సంగీతం అందించాడు. ఇక ఈ విషయాన్ని హీరో అడవి శేషు తెలిపాడు. ఇక ఈ విషయాన్ని శేష్ తెలియజేస్తూ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇలా అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్గా షార్ట్ ఫిలిం చేశారని తెలియడంతో ఒకవైపు పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసిన మరోవైపు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హీరోగా మిమ్మల్ని తెరపై చూడాలని భావించగా.. తెర వెనుక సంగీతం అందిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతారని తెలియడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి అకిరా అభిమానుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని వెండితెరపై కొనసాగుతారా లేక తెరవెనక కొనసాగుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -