Balayya Fans: బాలయ్య ఫ్యాన్స్ గుణశేఖర్ ను అందుకే టార్గెట్ చేశారా?

Balayya Fans: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ విడుదల కాగా పెద్ద ఎత్తున ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణం ఈ చిత్రాన్ని నిర్మించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు.

ఇక ఈ సినిమా కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు డైరెక్టర్లు సెలబ్రిటీలు నటించిన ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు గుణశేఖర్ ను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.అసలు గుణశేఖర్ ను బాలకృష్ణ అభిమానులు టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… 2015 వ సంవత్సరంలో అనుష్క రానా అల్లు అర్జున్ వంటి వారు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రుద్రమదేవి.

 

ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వలేదు.పన్ను మినహాయింపు ఇవ్వాలని గుణశేఖర్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేశారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇలా గుణశేఖర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వలేదు.

 

2017 వ సంవత్సరంలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా అదే ఏడాది ప్రకటించిన నంది అవార్డులలో రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడంతో ఆగ్రహించిన గుణశేఖర్ ప్రశ్నించడం తప్ప అంటూ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. దీంతో అప్పటినుంచి నారా నందమూరి అభిమానులు గుణశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ గుణశేఖర్ ను ట్రోల్ చేస్తున్నారు. నువ్వు తీసే సినిమాలపై కాస్త శ్రద్ధ పెడితే నంది అవార్డు కాకపోయినా… సుబ్బిరామిరెడ్డి అవార్డు అయిన వస్తుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -