Kushboo: నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు.. పవన్ గురించి అలా చెబుతూ?

Kushboo: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుష్బూ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక ఈమె ప్రస్తుత సినిమాలలో యంగ్ హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తాజాగా ఈమె డైరెక్టర్ శ్రీవాస్ దశకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి కుష్బూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో తాను భువనేశ్వరి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఇందులో మరుగున పడుతున్న మన సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లు గురించి తెలియజేసే పాత్రలో తాను నటిస్తున్నానని కుష్బూ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక తాను గోపీచంద్ తో కలిసిన నటించడం ఇదే మొదటి సారి అని తెలియజేశారు. అలాగే గతంలో తాను పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమా గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కు తల్లి పాత్రలో కుష్బూ నటించారు. అయితే ఈ విషయం గురించి కుష్బూ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ కు తల్లిగా నటించడాన్ని ప్రేక్షకులు తీసుకోలేకపోయారని అలా పవన్ కళ్యాణ్ కు తల్లిగా నటించకుండా ఉండాల్సిందని ఈమె తెలిపారు.ఇలా ఈ విషయాన్ని ప్రేక్షకులు అంగీకరించని నేపథ్యంలోనే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని ఈ సందర్భంగా అజ్ఞాతవాసి సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి కుష్బూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -