Samantha: సమంతకు మైండ్ బ్లాంక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. ఏమైందంటే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజీ హీరోయిన్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత సింపతీ కార్డు అప్లై చేసే సినిమా హిట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు.సమంత ప్రమోషన్లలో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం పట్ల నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత కేవలం సినిమాని హిట్ చేసుకోవడం కోసమే నాటకాలు ఆడుతుందని కామెంట్లు చేశారు. ఇక ఈమె నాగచైతన్యత విడాకుల తీసుకున్న తర్వాత జీవనాధారం కోసం ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారని తెలిపారు. అలాగే సమంత హీరోయిన్గా పనికిరాదని తన కెరియర్ ముగిసిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా చిట్టిబాబు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో సమంత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ నిర్మాతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

 

కొంత‌మంది చెవుల్లో వెంట్రుక‌లు ఎలా పెరుతాయి అంటూ గూగుల్ సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. అంతే కాకుండా గూగుల్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెర‌గ‌టం వ‌ల్ల‌నే అలా పెరుగుతాయ‌ని క‌నిపిస్తుంది. ఇక ఆ ఫోటోకు ఇఫ్ యూ నో యూనో అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇలా సమంత చిట్టిబాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే తాజాగా నిర్మాత చిట్టిబాబు సమంతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా చిట్టిబాబు సమంతకు గురించి పరోక్షంగా మాట్లాడుతూ నేను నీ గురించి మాట్లాడితే నువ్వు నీ తల ఎక్కడ పెట్టుకుంటావో అంటూ కామెంట్లు చేశారు. నేను కౌంటర్ ఇస్తే రిప్లై ఇవ్వలేవు నువ్వు నా చేవిలో వెంట్రుకలు గురించి మాట్లాడే బదులు నేను మాట్లాడిన మాటలలో నిజాయితీ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అంటూ మాట్లాడారు. ఇలా చిట్టిబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -