Senior NTR Rajinikanth: సీనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ మధ్య అలాంటి బంధం ఉండేదా?

Senior NTR Rajinikanth: నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం ఏంటో మన అందరికీ తెలిసిందే.సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందారు.ఇక గత ఏడాది మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే.అయితే ఏప్రిల్ 28 నుంచి మొదలుకొని మే 28 ఈ నెల రోజుల పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నారు.

ఈ క్రమంలోనే నేడు విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు.అయితే ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలు ఉండగా రజనీకాంత్ కు మాత్రమే ఎందుకు ఆహ్వానం పంపారు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

 

ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఎన్టీఆర్ గారిని చూసి రజనీకాంత్ ఎన్నో విషయాలు నేర్చుకున్నారని ఆయన నేర్పిన అడుగు జాడల్లోనే రజినీకాంత్ నడుస్తున్నారని చెప్పాలి.ఎన్టీఆర్ అంటే రజనీకాంత్ కు ఎనలేని అభిమానం ఇప్పుడు కూడా ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటో రజిని ఇంట్లో మనం చూడవచ్చు అంతలా అన్న గారిని రజినీకాంత్ అభిమానించేవారు.ఇలా ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అయినటువంటి రజనీకాంత్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో వెంటనే విజయవాడలో వాలిపోయారు.

 

ఎన్టీఆర్ సినిమాలలో కనుక నటిస్తే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అసలు నిర్మాతలను డిమాండ్ చేసేవారు కాదు. అనుకున్న సమయానికి షూటింగ్ లొకేషన్లో ఉండడం క్రమశిక్షణ ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారిని చూసే నేర్చుకున్నారని చెప్పాలి.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండడంతో అన్నగారి కార్యక్రమం ఆహ్వానానికి ఆహ్వానిస్తే మాట మాట్లాడకుండా రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -