Cyber Crime: ఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకున్నారా.. కచ్చితంగా చేయాల్సిన పని ఇదే!

Cyber Crime: ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఇక మనం ఏ షాపింగ్ మాల్ వెళ్లిన లేదా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా డబ్బులను ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాము.అలాగే ఫోన్ పే గూగుల్ పే వంటి వాటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కు పెద్ద ఎత్తున డబ్బులను ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాము. ఇలా చాలామంది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ కొన్నిసార్లు డబ్బును కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

 


అయితే ఇలా ఆన్లైన్ ద్వారా మనకు డబ్బులు కనుక కోల్పోయినట్లు ఉంటే వెంటనే మనం సదరు బ్యాంకును సంప్రదించి బ్యాంక్ అధికారులకు మన అకౌంట్ నుంచి డబ్బులు ఇతర అకౌంట్ కు వెళ్లడం లేదా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకు తెలియకుండా డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే అందుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి. ఇలా బ్యాంక్ అధికారులకు తెలియజేయడమే కాకుండా అందుకు సంబంధించిన మనం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇవ్వాలి.

 

ఇకపోతే మనకు తెలియకుండా మన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయితే వెంటనే మనం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి వారికి జరిగిన విషయం మొత్తం వివరించి కంప్లైంట్ ఇవ్వాలి.మన అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది ఎంత మొత్తంలో అయ్యింది అనే విషయాలన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయాలి. ఇలా చేయటం వల్ల పోయిన మన డబ్బును తిరిగి పొందగలుగుతాము.

 

ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలామంది ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము అంటూ మనకు ఫోన్లు చేయడం లేదా లింక్స్ పంపించడం జరుగుతుంది పొరపాటున కూడా మనం ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మనకు తెలియకుండానే మన ఖాతా ఖాళీ అవుతుంది అందుకే ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండమని ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా పెద్ద ఎత్తున మోసపోతు పోలీసులను ఆశ్రయిస్తున్న సందర్భాలు తలెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -